శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): సంక్రాంతి పండుగ సందర్భంగా శేరిలింగంపల్లికి చెందిన అవని స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు శిరీష సత్తూర్ ఆధ్వర్యంలో హరితహారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తెనాలిలోని జెడ్ పీ హెచ్ పాఠశాల ప్రిన్సిపాల్ మంజుల వాణి సహకారంతో, ఇతర ఉపాధ్యాయులతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమంన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా కార్యక్రమ నిర్వహణకు సహకరించిన అందరికీ శిరీష సత్తూర్ కృతజ్ఞతలు తెలిపారు.