గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్‌పల్లి విలేజ్‌లో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఆదివారం పర్యటించారు. రహదారులపై డ్రైనేజీ పొంగి పొర్లుతుందని స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఆయన స్వయంగా సంఘటనా స్థలానికి వెళ్లి సమస్యను పరిశీలించారు. వెంటనే జీహెచ్ఎంసీ శానిటరీ రీసోర్స్ పర్సన్ భరత్‌ను పిలిపించి సమస్యను త్వరగా పరిష్కరించాలని అన్నారు. వెంటనే సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని భరత్ తెలిపారు. అనంతరం గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ డివిజన్ పరిధిలో ప్రజలు ఎలాంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని అన్నారు.