శేరిలింగంపల్లి లో ముగిసిన పోలింగ్ …ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

శేరిలింగంప‌ల్లి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌శాంతంగా ముగిసింది. కోవిడ్ నిబంధ‌న‌ల న‌డుమ‌, అత్యంత ప‌టిష్ట‌మైన బందోబ‌స్తుతో ఎన్నిక‌ల‌ను అధికారులు ప్ర‌శాంతంగా నిర్వ‌హించారు. ఉద‌యం నుంచి పోలింగ్ మంద‌కొడిగా కొన‌సాగినా మ‌ధ్యాహ్నం పుంజుకుంటుంద‌ని భావించారు. కానీ ఓట‌ర్లు ఓటు వేసేందుకు ఆస‌క్తిని చూప‌లేదు. దీంతో పోలింగ్ శాతం చాలా త‌క్కువ‌గా న‌మోదైంది. ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ, శ్యామల దేవి దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మసీద్ బండ లో మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో పాటు ఆయా డివిజన్ల అభ్యర్థులు, పలువురు ప్రముఖులు, రాజకీయ పార్టీల నాయకులు తమ తమ ప్రాంతాల్లో ఓటు వేశారు.

ఓటుహక్కును వినియోగించుకున్న శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ దంపతులు
పోలింగ్ కేంద్రంలో ఓటు వేస్తున్న మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్
ఓటు హక్కును వినియోగించుకున్న గచ్చిబౌలి డివిజన్ టిఆర్ఎస్ అభ్యర్థి కొమిరిశెట్టి సాయిబాబ
నల్లగండ్ల గ్రామంలోని అక్షయ ఫౌండేషన్ స్కూల్ పోలింగ్ కేంద్రంలో ఓటు హ‌క్కును వినియోగించుకున్న జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్, పూజిత గౌడ్
ఓటు హక్కు వినియోగించుకున్న శేరిలింగంపల్లి అభ్యర్థి రాగం నాగేందర్ యాదవ్
చందానగర్ లో ఓటు హక్కు వినియోగించుకున్న టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంజుల రఘునాథ్ రెడ్డి దంపతులు

 

ఓటు హ‌క్కును వినియోగించుకున్న గచ్చిబౌలి బిజెపి అభ్యర్థి గంగాధర్ రెడ్డి

 

ఓటు హక్కు వినియోగించుకున్న రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్ పర్సన్ సుజాత నాగేందర్ యాదవ్
ఓటు హక్కును వినియోగించుకున్న బిజెపి నాయకులు రవికుమార్ యాదవ్
ఓటు వేసిన చందానగర్ బిజెపి అభ్యర్థి కసిరెడ్డి సింధు రెడ్డి, కసిరెడ్డి భాస్కర రెడ్డి
మియాపూర్ లో ఓటుహక్కు వినియోగించుకున్న టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉప్పలపాటి శ్రీకాంత్
పార్టీ నాయకులతో కలిసి ఓటు వేసిన కొండాపూర్ అభ్యర్థి హమీద్ పటేల్
హఫీజ్ పేట్ లో ఓటు హక్కు వినియోగించుకున్న బోయిని అనూష మహేష్ యాదవ్ దంపతులు
ఖానామేట్ లో ఓటు హక్కు వినియోగించుకున్న బిజెపి అభ్యర్థి గంగల రాధాకృష్ణ యాదవ్

ఓటు హక్కు వినియోగించుకున్న ఆల్విన్ కాలనీ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దొడ్ల వెంకటేష్ గౌడ్

 

 

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here