శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి, చందానగర్ జంట సర్కిళ్లలో పోలింగ్ శాతం భారీగా తగ్గింది. గతంలో కన్నా ఈ సారి పోలింగ్ శాతం బాగా తక్కువగా నమోదవుతోంది. సాయంత్రం 5 గంటల వరకు శేరిలింగంపల్లి సర్కిల్ 20 పరిధిలో మొత్తం 28.14 శాతం పోలింగ్ నమోదైంది. సర్కిల్ పరిధిలోని 104 కొండాపూర్ డివిజన్‌లో 24.18 శాతం, 105 గచ్చిబౌలి డివిజన్‌లో 31.98 శాతం, 106 శేరిలింగంపల్లి డివిజన్‌లో 29.36 శాతం పోలింగ్ నమోదు అయింది.
చందానగర్ సర్కిల్ పరిధిలో సాయంత్రం 5 గంటల వరకు మొత్తం 26.4 శాతం పోలింగ్ నమోదైంది. సర్కిల్ పరిధిలోని 107 మాదాపూర్ డివిజన్‌లో 25.04 శాతం, 108 మియాపూర్ డివిజన్‌లో 26.33 శాతం, 109 హఫీజ్‌పేట డివిజన్‌లో 22.14 శాతం, 110 చందానగర్ డివిజన్‌లో 32.85 శాతం పోలింగ్ నమోదైంది.