శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): గ‌్రేటర్ ఎన్నికల నేపథ్యంలో శేరిలింగంపల్లి, చందానగర్ జంట సర్కిళ్లలో పోలింగ్ శాతం తక్కువగానే నమోదవుతోంది. ఉదయం పోలింగ్ మందకొడిగా కొనసాగినా మధ్యాహ్నం తరువాత పుంజుకుంటుందని భావించారు. కానీ ఓటర్లు గడపదాటి ఓటు వేసేందుకు నిరాసక్తతను కనబరిచారు. దీంతో శేరలింగంపల్లి సర్కిల్ 20 పరిధిలో మధ్యాహ్నం 3 గంటల వరకు మొత్తం 22.80 పోలింగ్ శాతం నమోదైంది.
శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని 104 కొండాపూర్ డివిజన్‌లో మధ్యాహ్నం 3 గంటల వరకు 19.64 శాతం పోలింగ్ నమోదు కగా, 105 గచ్చిబౌలి డివిజన్‌లో 26.56 శాతం, 106 శేరిలింగంపల్లిలో 23.24 శాతం పోలింగ్ నమోదైంది.
అలాగే చందానగర్ సర్కిల్ 21 పరిధిలో మధ్యాహ్నం 3 గంటల వరకు 22.55 శాతం పోలింగ్ నమోదైంది. 107 మాదాపూర్ డివిజన్‌లో 22.70 శాతం, 108 మియాపూర్ డివిజన్‌లో 25.47 శాతం, 109 హఫీజ్‌పేట డివిజన్‌లో 20.98 శాతం, 110 చందానగర్ డివిజన్‌లో 21.42 శాతం పోలింగ్ నమోదైంది. ఇక పోలింగ్‌కు మరో 3 గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. సమయం ముగిసే వరకు పోలింగ్ స్టేషన్ ఆవరణలో ఉన్న అందరికీ ఎంత సమయం అయినా సరే ఓటు వేసేందుకు అవకాశం కల్పించనున్నారు.
Nice updates