గ‌చ్చిబౌలి డివిజ‌న్ అభివృద్ధికి కృషి: కార్పొరేట‌ర్ వి.గంగాధ‌ర్ రెడ్డి

గ‌చ్చిబౌలి‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గ‌చ్చిబౌలి డివిజ‌న్ ప‌రిధిలోని గోప‌న్‌ప‌ల్లి అప‌ర్ణ వాసులు కార్పొరేట‌ర్ వి.గంగాధ‌ర్ రెడ్డిని స‌న్మానించారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ త‌న‌కు ఓటు వేసి గెలిపించిన ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నాన‌న్నారు. డివిజ‌న్ అభివృద్ధికి ఎల్ల‌వేళ‌లా అందుబాటులో ఉంటాన‌ని, ఎలాంటి స‌మ‌స్య‌లు ఉన్నా త‌న దృష్టికి తీసుకువ‌స్తే ప‌రిష్క‌రిస్తాన‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో అపర్ణ మేనేజింగ్ కమిటీ మెంబర్స్, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

కార్పొరేట‌ర్ వి.గంగాధ‌ర్ రెడ్డిని స‌న్మానించిన గోప‌న్‌ప‌ల్లి అప‌ర్ణ వాసులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here