ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వ‌ర్యంలో మ‌హిళ‌ల‌కు ముగ్గుల పోటీలు

శేరిలింగంపల్లి‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి జంట సర్కిళ్ల‌ పరిధిలోని నేతాజీ నగర్, ఎంఐజీ కాలనీ ఫేజ్‌ 1, హుడా కాలనీ సంతోషిమాత టెంపుల్ దగ్గర, హనుమాన్ టెంపుల్ దగ్గర, రాజీవ్ స్వగృహ ఆరంభ టౌన్ షిప్ వ‌ద్ద ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వ‌ర్యంలో శ‌నివారం మ‌హిళ‌ల‌కు ముగ్గుల పోటీల‌ను నిర్వ‌హించారు. జాగర్లమూడి జనా‌ర్దన రావు సౌజన్యంతో పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతుల‌ను అంద‌జేశారు. చందానగర్ సీఐ క్యాస్ట్రో రెడ్డి, ఎస్ఐలు అహ్మద్ బాషా, రాములులు విజేత‌ల‌కు బ‌హుమ‌తుల‌ను ప్ర‌దానం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు రజని, శివరామకృష్ణ, విష్ణు ప్రసాద్, పాలం శ్రీను, కాలనీల మహిళా నాయకురాళ్లు కుమారి, జ్యోతి, రాధారాణి, సరళ, విజయలక్ష్మి, మాధవి, సుధ, ఉషారాణి, సుశీల పాల్గొన్నారు.

విజేత‌ల‌కు బ‌హుమ‌తుల‌ను అంద‌జేస్తున్న సీఐ క్యాస్ట్రో రెడ్డి, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్
మ‌హిళ‌ల‌తో సీఐ క్యాస్ట్రో రెడ్డి, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here