మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ లో నూతనంగా ఏర్పాటు చేయబోయే బస్తీ దవాఖానను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ కాలనీ, బస్తీలలో పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయలను అందించాలనే ఉద్దేశ్యంతో బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన జీవన ప్రమాణాల కోసం ఎంతగానో కృషి చేస్తోందని అన్నారు. దాతల సహకారంతో కంటైనర్ లో బస్తీ దవాఖానాను ఏర్పాటు చేయడం అభినందనీయం అని అన్నారు. అన్ని హంగులతో సకల సదుపాయాలతో ఏర్పాటు చేయడం అభినందనీయం అని అన్నారు. త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు ఆదర్శ్ రెడ్డి, సాంబశివరావు, గుమ్మడి శ్రీనివాస్, బ్రిక్ శ్రీను, పితాని శ్రీను, చౌదరి, అప్పారావు, నాగభూషణం, కాలనీ వాసులు పాల్గొన్నారు.