వివేకానందనగర్ (నమస్తే శేరిలింగంపల్లి): అయోధ్య భవ్య రామమందిర నిర్మాణం నిధి సేకరణలో భాగంగా వివేకానందనగర్ డివిజన్ కి సంబంధించిన రాజేష్ చౌదరి, హంస రామ్ చౌదరి, ఉత్తమ్ చౌదరి, వినోద్ చౌదరి, భన్వర్ లాల్ చౌదరిలు బిజెపి రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు బండి సంజయ్ కి రూ.1,53,000 చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు చౌదరి ధర్మారావు, ఉప్పల ఏకాంత్ గౌడ్ పాల్గొన్నారు.