నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని డీకే ఎన్ క్లేవ్ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. డీకే ఎన్ క్లేవ్ లో నెలకొన్న డ్రైనేజీ సమస్యలను కాలనీ వాసులు, స్థానిక నాయకులతో కలిసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీకే ఎన్ క్లేవ్ కాలనీలో మౌళిక వసతుల కల్పనే ప్రధాన ద్యేయంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. కాలనీలో నెలకొన్న డ్రైనేజీ, రోడ్లు, మంచినీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సహకారంతో డివిజన్ లో మంజూరైన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మాధవరం గోపాల్, రాజు, విజయ్, ముదిరాజ్, రాంబాబు, విజయ్, అనిల్ రాయ్ తదితరులు
పాల్గొన్నారు.