నమస్తే శేరిలింగంపల్లి: రాష్ట్రoలో ఉన్న బిసి కులాల వారందరికీ బిసి బంధు ప్రకటించి, ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలని మంగళవారం బిసి సంఘం నాయకులు రామచంద్రాపురం తహశీల్దారు కు శివ కుమార్ కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బిసి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు భేరి రాంచందర్ యాదవ్, ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు తెనుగు నర్సింలు ముదిరాజ్ మాట్లాడుతూ జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. తొలిగించిన ఫీల్డ్ అసిస్టెంట్ లను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బిసిల ఐక్యత వర్ధిల్లాలి అంటూ బ్యానర్ తో ప్రదర్శన నిర్వహించారు. బిసి బందు పథకాన్ని ప్రకటించిని పక్షంలో కేసీఆర్ కు బిసిలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఐ దీక్షిత్, సంగారెడ్డి జిల్లా యూత్ విభాగం అధ్యక్షుడు గణేష్ యాదవ్, తెల్లాపూర్ మాజీ సర్పంచ్ ఎన్. కృష్ణ, వాటర్ కమిటీ మాజీ చైర్మన్ నర్సింహా, తెల్లాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ధరణి రాజు, పాండు యాదవ్, సురేష్ చారి, కిట్టు ముదిరాజ్, మున్సిపల్ బీజేపీ ప్రధాన కార్యదర్శి శివ శంకర్, వనపర్తి ఉప సర్పంచ్ యూ. లక్ష్మణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.