హఫీజ్‌పేట (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్ పేట్ డివిజన్ టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు విమల్ కుమార్ జన్మదినం సందర్భంగా గంగారం ఎల్లమ్మ ఆలయంలో ఆయనతో కలిసి కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ పూజలు నిర్వహించారు. అనంతరం విమల్ కుమార్‌కు జగదీశ్వర్ గౌడ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొని విమల్ కుమార్‌చే కేక్ కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, నాయకులు మిరియాల రాఘవ రావు, శేఖర్ గౌడ్, హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్, వినయ్ కుమార్ పుట్ట గౌడ్, రవీందర్ రెడ్డి, వార్డ్ సభ్యులు శేఖర్ ముదిరాజ్, రాజధర్మ రెడ్డి, హనీఫ్, రవి కుమార్, ప్రవీణ్ కుమార్, జ్ఞానేశ్వర్, నరేందర్ బల్లా, చిన్నా, వేరేందర్, భగత్, పద్మారావు, విఘ్నేశ్వర్, గోపాల్, రమేష్ పాల్గొన్నారు.

