జయశంకర్ ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి: ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 6 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా శేరిలింగంపల్లి డివిజన్‌లో ఘనంగా నివాళులర్పించారు. ప్రొఫెసర్ జయశంకర్ సర్కిల్ (రైల్వే అండర్ బ్రిడ్జి) వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పీఏసీ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శేరిలింగంపల్లి మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ పోషించిన పాత్ర చిరస్మరణీయమని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు రూపం ఇచ్చిన మహనీయుడిగా ఆయనను కొనియాడారు. జయశంకర్ ఆశయాలను కొనసాగించడమే ప్రతి ఒక్కరి బాధ్యత అని, యువత ఆయన చూపిన మార్గంలో నడిచి తెలంగాణ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డివిజన్ గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్, మాజీ కౌన్సిలర్ రవీందర్ రావు, సీనియర్ నాయకుడు కొండల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, కే రాంచందర్, వార్డు సభ్యురాలు శ్రీకళతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్ కు ఘనంగా నివాళులర్పించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here