1995-96 ఎస్‌ఎస్‌సీ బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 7 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): పూర్వ విద్యార్థిని, విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా 1995-96 ఎస్‌ఎస్‌సీ బ్యాచ్ కార్యక్రమాన్ని నిజామాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సైబర్ సిటీ సర్కిల్ ప్రెసిడెంట్ (327 ఐఎన్‌టీయూసీ) కే. వెంకటేశ్వర్లు తన సతీమణి కురుమ ఉమాదేవితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ సతీమణి ఉమాదేవితో పాటు తాము కూడా అదే పాఠశాలలో ఎస్‌ఎస్‌సీ విద్యను అభ్యసించడం ఆనందంగా ఉందని వెంకటేశ్వర్లు తెలిపారు. చిన్ననాటి విద్యను బోధించిన గురువులతో కలిసి సుమారు 50 మంది పూర్వ విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో విద్యార్థులకు విద్యాబోధన చేసిన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి, మెమొంటోలు (షీల్డులు) అందజేశారు. అనంతరం జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల ప్రాంగణంలోని శ్రీ శ్రీ భూదేవి, శ్రీదేవి వరదరాజుల స్వామి ఆలయ ప్రాంగణంలో గురువులు, పూర్వ విద్యార్థిని, విద్యార్థులతో కలిసి జమ్మి మొక్కలను నాటారు. వృక్షో రక్షతి రక్షితః అనే సందేశంతో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here