విద్యార్థులు, యువత ప్రధాని మోదీని ఆదర్శంగా తీసుకోవాలి: కైతాపురం జితేందర్

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 6 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): భారతదేశ విద్యార్థులు, యువత ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాసేవా ప్రస్థానాన్ని ఆదర్శంగా తీసుకొని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ కార్యదర్శి మాణిక్ రావు అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్–2026లో భాగంగా, ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా సేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హఫీజ్‌పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కైతాపురం జితేందర్ ఆధ్వర్యంలో హఫీజ్‌పేట్ అంబేద్కర్ నగర్‌లోని ఎంపీపీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నా కలలోని భారత్ అంశంపై చిత్రలేఖనం, ఎస్సే రైటింగ్ పోటీలు నిర్వహించారు.

పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేయడంతో పాటు పాల్గొన్న విద్యార్థులందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాణిక్ రావు మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేశారని అన్నారు. స్వయంసేవక్‌గా, బీజేపీ నాయకుడిగా, గుజరాత్ ముఖ్యమంత్రిగా, భారత ప్రధానిగా వివిధ స్థాయిల్లో ప్రజా శ్రేయస్సు కోసం పనిచేశారని పేర్కొన్నారు. విద్యార్థులు, యువత ఆయన సేవా ప్రస్థానం నుంచి స్ఫూర్తి పొంది తమ లక్ష్యాలను సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ ఎస్టీ మోర్చా అధ్యక్షుడు విజేందర్ సింగ్, బీజేపీ జిల్లా కౌన్సిల్ సభ్యుడు ఆళ్ల వరప్రసాద్, బీజేపీ నాయకుడు శ్రీనివాస్ యాదవ్, హఫీజ్‌పేట్ డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి జగన్ గౌడ్, నాయకులు అఖిల్ యాదవ్, రాజశేఖర్, కిరణ్ కుమార్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here