వైశాలి నగర్ అండర్‌పాస్‌లో ట్రాఫిక్ ఆంక్షలు మరో వారం పొడిగింపు

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 6 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): వైశాలి నగర్ రైల్వే అండర్‌పాస్‌ వద్ద కొత్తగా వేసిన రోడ్డు ఉపరితలం క్యూరింగ్‌ (బలంగా, నాణ్యంగా మారేందుకు అవసరమైన ప్రక్రియ) కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలను మరో వారం పొడిగిస్తూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. అక్టోబర్ 8 నుంచి 14వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. రోడ్డు విస్తరణ, స్టార్మ్‌ వాటర్ డ్రెయిన్ పనులు పూర్తయినప్పటికీ.. కొత్తగా నిర్మించిన రోడ్డు పూర్తిస్థాయిలో క్యూరింగ్‌ అయ్యే వరకు వాహనాల రాకపోకలను నియంత్రించాల్సిన అవసరం ఉందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ప్రజల భద్రత, రోడ్డు పనుల నాణ్యత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

మైహోమ్ మంగళ అపార్ట్‌మెంట్స్ నుంచి హఫీజ్‌పేట్ వైపు: వైశాలి నగర్ రైల్వే అండర్‌పాస్‌ మీదుగా వెళ్లే వాహనాలను మైహోమ్ మంగళ T-జంక్షన్‌ వైపు మళ్లిస్తారు. అక్కడి నుంచి రాఘవేంద్ర నగర్ కాలనీ జంక్షన్, హైటెన్షన్ రోడ్, ఆర్టీఏ కార్యాలయం–కొండాపూర్, హఫీజ్‌పేట్ ROB/ఫ్లైఓవర్ మీదుగా వెళ్లేలా ప్రత్యామ్నాయ మార్గాన్ని సూచించారు. తెలంగాణ కాంట్రాక్టర్స్ కల్చరల్ క్లబ్ నుంచి వైశాలి నగర్ వైపు: ఈ మార్గంలోని వాహనాలను మైహోమ్ మంగళ T-జంక్షన్‌ వద్ద మళ్లించి, రాఘవేంద్ర నగర్ కాలనీ జంక్షన్, హైటెన్షన్ రోడ్, RTA కార్యాలయం–కొండాపూర్, హఫీజ్‌పేట్ ROB/ఫ్లైఓవర్ మీదుగా హఫీజ్‌పేట్, ఆల్విన్ జంక్షన్ వైపు పంపిస్తారు. హఫీజ్‌పేట్, RTC కాలనీ, మైహోమ్ జ్యువెల్ ప్రాంతాల నుంచి: మైహోమ్ జ్యువెల్ రియర్ గేట్, RTC కాలనీ, మంజీరా పైప్‌లైన్ రోడ్‌ నుంచి మైహోమ్ మంగళ/రాఘవేంద్ర నగర్ కాలనీ వైపు వెళ్లే వాహనాలను పైప్‌లైన్ రోడ్, వైశాలి నగర్ ROB/ఫ్లైఓవర్ మీదుగా మళ్లిస్తారు. జనరల్ ఎలక్ట్రిక్‌ (GENPACT) సమీపంలో ఎడమ మలుపు తీసుకుని కొండాపూర్–ఆల్విన్ జంక్షన్ రోడ్, గవర్నమెంట్ స్కూల్ U-టర్న్, హఫీజ్‌పేట్ ROB/ఫ్లైఓవర్ మార్గంలో వెళ్లాలి.

మైహోమ్ మంగళ/రాఘవేంద్ర నగర్ కాలనీ వైపు వెళ్లే వాహనాలను స్పైర్ వన్ అపార్ట్‌మెంట్స్ వద్ద U-టర్న్‌ ద్వారా హఫీజ్‌పేట్ ROB/ఫ్లైఓవర్ వైపు మళ్లిస్తారు. అక్కడి నుంచి GENPACT సమీపంలో ఎడమ మలుపు తీసుకుని కొండాపూర్–ఆల్విన్ జంక్షన్ రోడ్, గవర్నమెంట్ స్కూల్ U-టర్న్, హఫీజ్‌పేట్ ROB/ఫ్లైఓవర్ మీదుగా వెళ్లాలి. గోపాల్‌నగర్/కాల్వరీ టెంపుల్ నుంచి మైహోమ్ మంగళ వైపు: పాత హఫీజ్‌పేట్ వద్ద రైల్వే అండర్‌పాస్/రూబ్‌ వద్ద కుడివైపు మలుపు తీసుకుని, కొండాపూర్–ఆల్విన్ జంక్షన్ రోడ్, గవర్నమెంట్ స్కూల్ U-టర్న్, హఫీజ్‌పేట్ ROB/ఫ్లైఓవర్ మార్గంలో వెళ్లాలని సూచించారు. ట్రాఫిక్ మళ్లింపుల కాలంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించి ముందుగానే ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ట్రాఫిక్ సజావుగా సాగేందుకు పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ ట్రాఫిక్ అడ్వైజరీపై సైబరాబాద్ ట్రాఫిక్ విభాగం సంబంధిత పోలీస్ స్టేషన్లు, కమాండ్‌ అండ్‌ కంట్రోల్ సెంటర్, మీడియా, ఐటీ సంస్థలకు సమాచారం అందించి విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here