ప్రజా సంగ్రామ యాత్రకు విశేష ప్రజాదరణ: బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర 9 వ రోజు వికారాబాద్ నుండి మోమిన్‌పేట్ వరకు కొనసాగింది. బండి సంజయ్ తో పాటు నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ తో కలిసి బిజెపి రాష్ట్ర నాయకులు రవి కుమార్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి పాదయత్ర చేశారు.‌ ఈ సందర్భంగా రాష్ట్ర బిజెపి నాయకులు రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ యాత్ర పొడవునా కార్యకర్తలు, ప్రజల ఉత్సాహం చూస్తుంటే రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అన్నారు. టిఆర్ఎస్ పాలనతో విసిగిపోయిన ప్రజలు, బీజేపీని ప్రత్యామ్నాయ శక్తిగా ఎంచుకుంటున్నారు అనడానికి పాదయాత్రకు వస్తున్న స్పందనే నిదర్శనం అని అన్నారు. ఇదే స్ఫూర్తితో శేరిలింగంపల్లిలోను పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు .అనంతరం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసగించి స్వార్థ పాలకులు అధికారంలోకి వచ్చారన్నారు. కుటుంబ పాలన, అవినీతి, నియంతృత్వ పోకడలతో నాటి ఆశయాలు, పోరాటాలకు విలువ లేకుండా చేశారన్నారు. ఈ దుస్థితి నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకుని, బంగారు తెలంగాణ కలల్ని సాకారం చేసుకోవడానికి బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. స్వార్థ పాలకుల నైజాన్ని బట్టబయలు చేసి, తెలంగాణ ప్రజల్లో చైతన్యాన్ని రగిలించే లక్ష్యంతో జరిగే ఈ ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొనడం తెలంగాణ తల్లికి నిజమైన సేవగా భావిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెవైఎం రాష్ట్ర నాయకురాలు కసిరెడ్డి సిందురఘునాథ్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, శేరిలింగంపల్లి డివిజన్ బిజెపి కంటెస్టెడ్ కార్పొరేటర్ కంచర్ల ఎల్లేష్, సీనియర్ నాయకులు కసిరెడ్డి రఘునాథ్ రెడ్డి, శివ సింగ్, నర్సింగ్ నాయక్, కిషన్ గౌలి, హరీష్ శంకర్ యాదవ్, హఫీజ్, అరవింద్ సింగ్, జితేందర్ సింఘ్, రంగస్వామి,శంకేష్, క్రాంతి, నరేష్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here