మైనారిటీల‌ ఉత్సాహం చూస్తూంటే శేరిలింగంప‌ల్లిలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ‌వైభ‌వం ఖాయం: ఫిరోజ్ ఖాన్‌

  • శేరిలింగంప‌ల్లి కాంగ్రెస్ ఆద్వ‌ర్యంలో చేప‌ట్టిన‌ మైనారిటీ ల‌ల్‌ఖార్ స‌భ విజ‌య‌వంతం

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: శేరిలింగంప‌ల్లిలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ‌వైభ‌వం రావ‌డం ఖాయ‌మ‌ని కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు, నాంప‌ల్లి అసెంబ్లి ఇంచార్జ్ ఫెరోజ్ ఖాన్ పేర్కొన్నారు. శేరిలింగంప‌ల్లి కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగం ఆద్వ‌ర్యంలో ఆదివారం చందాన‌గ‌ర్‌లోని జేవీఎన్ గార్డెన్స్‌లో మైనారిటీ ల‌ల్‌ఖార్ పేరిట ప్ర‌త్యేక స‌భ‌ను ఏర్పాటు చేశారు. మైనారిటీ నాయ‌కులు జ‌హాంగీర్‌, అజీముద్దీన్‌ల నాయ‌క‌త్వంలో జ‌రిగిన ఈ స‌భ‌లో నియోజ‌క‌వ‌ర్గంలోని ముస్లింమైనారిటీలు పెద్ద సంఖ్య‌లో పాల్గొని ఉత్సాహం క‌న‌బ‌రిచారు. ఈ కార్య‌క్రమంలో ఫెరోజ్ ఖాన్‌తో పాటు టీపీసీసీ మైనారిటీ చైర్మ‌న్ సోహైల్ ఖాన్ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్ర‌భుత్వం మైనారిటీల‌ను వాడుకోని వ‌దిలేసిందని, రాబోయే ఎన్నిక‌ల్లో మైనారిటీల స‌త్త ఏంటో నిరూపించుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని అన్నారు.

స‌మావేశంలో మాట్లాడుతున్న ఫిరోజ్ ఖాన్‌, వేధిక‌పై శేరిలింగంప‌ల్లి కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు

ఎంఐఎంతో జ‌త‌క‌ట్టి మైనారిటీల అభివృద్ధి, సంక్షేమానికి తూట్లు పొడుస్తున్నార‌ని ద్వ‌జ‌మెత్తారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం సాధించుకుంటేనే మైనారిటీల‌కు త‌గిన గుర్తింపు ద‌క్కుతుంద‌ని అన్నారు. శేరిలింగంప‌ల్లిలో మైనారిటీల ఉత్సాహం చూస్తుంటే ఇక్క‌డ కాంగ్రెస్ పార్టీకి పూర్వ‌వైభ‌వం ద‌క్క‌డం ఖాయంగా క‌నిపిస్తుంద‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో శేరిలింగంప‌ల్లి కాంగ్రెస్ పార్టీ స‌మ‌న్వ‌యక‌ర్త ర‌ఘునందన్ రెడ్డి, సీనియ‌ర్ నాయ‌కులు జెరిపేటి జైపాల్‌, మహిపాల్ యాద‌వ్‌, ఇలియాస్ ష‌రీఫ్‌, హ‌బీబ్‌, అయాజ్ ఖాన్‌, సురేష్ నాయ‌క్‌, నగేష్ నాయ‌క్‌, రేణుక‌, మారెళ్ల శ్రీనివాస్, భ‌ర‌త్ గౌడ్‌, రాజ‌న్‌, దుర్గం శ్రీహ‌రి గౌడ్‌, ఫ‌యాజ్‌, ల‌తీక్‌, చాంద్‌, హ‌మీద్‌, దుర్గేష్,  ఖాజా, మెరాజ్, ఆజం త‌దిత‌రులు పాల్గొన్నారు.

స‌మావేశంలో మాట్లాడుతున్న టీపీసీసీ మైనారిటీ చైర్మ‌న్ సోహైల్ ఖాన్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here