క్షేత్ర స్థాయిలో పార్టీ బ‌లోపేతానికి పాటుప‌డాలి – బిజెపి రాష్ట్ర నాయ‌కులు ర‌వికుమార్ యాద‌వ్‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లిః బిజెపి సిద్ధాంతాలకు, ఆద‌ర్శాల‌కు అంకిత‌మై, నీతి, నిజాయితీ, క్ర‌మ‌శిక్ష‌ణ‌తో వ్య‌వ‌హ‌రిస్తూ క్షేత్ర స్థాయిలో పార్టీ బ‌లోపేతానికి కృషి చేయాల‌ని బిజెపి రాష్ట్ర నాయ‌కులు ర‌వికుమార్ యాద‌వ్ అన్నారు. బిజెపి మాదాపూర్ డివిజన్ అధ్య‌క్షుడు  వినయ్ బాబు ఆధ్వర్యంలో  బిజెపి  పొలిటికల్ ఆర్గనైజేషన్ జాయింట్ కన్వినర్ గా డి. శ్రీనివాస్ రెడ్డి ని,  మాదాపూర్ డివిజన్ ఎస్టీ మోర్చా అధ్యక్షునిగా కె. బాలు నాయక్ ను నియ‌మిస్తూ బిజెపి రాష్ట్ర నాయ‌కులు రవికుమార్ యాదవ్ నియామక పత్రాల‌ను అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ  బిజెపి బ‌లోపేతానికి కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులతో క‌లిసిక‌ట్టుగా ప‌నిచేసి చిత్త‌శుద్ధితో ప‌నిచేయాల‌ని సూచించారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుని వాటి ప‌రిష్కారం కోసం ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా పోరాటం చేయాల‌ని పేర్కొన్నారు. పార్టీని సంస్థాగ‌తంగా ప‌టిష్ట ప‌రిచి పార్టీ కార్యక్ర‌మాల్లో చురుగ్గా పాల్గొనాల‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు హనుమంత్ నాయక్, డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ రాధాకృష్ణ యాదవ్,  ఉపాధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి,  మధు యాదవ్, ప్రధాన కార్యదర్శి మదనాచారి, సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, నరేష్ రెడ్డి, హనుమంతు, బిజెపి నాయకులు పాల్గొన్నారు.


నియామకపు పత్రాలను అందజేస్తున్న బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here