నమస్తే శేరిలింగంపల్లి: రాష్ట్రంలో బిజెపి హవా నడుస్తోందని, 2023 లో టీఆర్ఎస్ గద్దె దించి బిజెపి ప్రభుత్వం ఏర్పాటుకానుందని బిజెపి రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. దీప్తిశ్రీనగర్ లో నాగం రాజశేఖర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బిజెపి జెండాను కసిరెడ్డి భాస్కర రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం వాగ్ధానాలు నెరవేర్చడంలో వైఫల్యం చెందడమే కాకుండా, అధికారంలోకి రావడానికి కారణమైన మూల సిద్ధాంతాలు నీళ్లు, నిధులు, ఉద్యోగాల కల్పనలో వైఫల్యం చెంది, ప్రజాగ్రహానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. మాజీ కౌన్సిలర్ కె. రాఘవేంద్రరావు, మాజీ సైనికుల సెల్ రాష్ట్ర కన్వీనర్ నాగం రాజశేఖర్ మాట్లాడుతూ ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చి ప్రజాసమస్యలను పరిష్కరించడంలో విఫలమైందన్నారు. రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం మాత్రమే బాగుపడిందన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర నార్త్ ఇండియన్ వాసుల తెలంగాణ శాఖ అధ్యక్షుడు దినేష్ జైశ్వాల్ కు కసిరెడ్డి భాస్కరరెడ్డి బిజెపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కొండాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఆంజనేయులు, చందానగర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి శివకుమార్ వర్మ, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గూడూరి త్రినాథ్, మహిళా మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి మేరీ సోలమన్, జిల్లా స్పోర్ట్స్ సెల్ కన్వీనర్ వినీతాసింగ్, నార్త్ ఇండియన్ సెల్ కన్వీనర్ రాజ్ జైశ్వాల్, ఐటీ సెల్ కన్వీనర్ మధుసూదనరావు, కసిరెడ్డి రఘునాథ్ రెడ్డి, అమరేంద్ర ప్రతాప్ సింగ్, మాదాపూర్ డివిజన్ మహిళామోర్చా అధ్యక్షురాలు సుమారెడ్డి, చందానగర్ డివిజన్ ఉపాధ్యక్షుడు అమరేంద్ర ప్రతాప్ సింగ్, లక్ష్మణ్ ముదిరాజ్, గుండె గణేష్ ముదిరాజ్, శివ, రమేష్, వంశి, గోపి, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.