నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని పీజేఆర్ స్టేడియంలో మెగా క్రిస్మస్ వేడుకలను శనివారం రాత్రి నిర్వహించారు. ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా క్రిస్మస్ వేడుకల్లో చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్.జి.రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పాల్గొని క్రిస్మస్ వేడుకలను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ క్రిస్మస్ కానుకలను అందజేయడం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల వారిని సమానంగా చూస్తూ అందరి మన్ననలు పొందుతోందని అన్నారు. యేసుక్రీస్తు జన్మదినంను పురస్కరించుకుని ముందస్తుగా సెమీ క్రిస్టమస్ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం సంతోషకరమని అన్నారు. క్రిస్మస్ పండుగను ఆనందోత్సవాలతో, భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ క్రైస్తవ సోదర, సోదరీమణులందరికీ ముందస్తు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి, పూజితజగదీశ్వర్ గౌడ్, రోజాదేవి రంగారావు, రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్, దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నే శ్రీనివాస రావు, ఉప్పలపాటి శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్ సాయిబాబా, నాయకులు, పాస్టర్లు, క్రైస్తవ సోదరులు, సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు.