మియాపూర్ ఫోటో, వీడియో గ్రాఫర్స్ జట్టుకు బలరామ్ యాదవ్ రూ.10 వేల ఆర్థిక సాయం

శేరిలింగంప‌ల్లి, జూలై 12 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఉప్పల్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక PCL-6 క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొంటున్న మియాపూర్ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ జట్టుకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బలరామ్ యాదవ్ ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా పానుగంటి గణేష్ ఆధ్వర్యంలో అసోసియేషన్ ప్రతినిధులు బలరామ్ యాదవ్‌ను కలిసి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం బలరామ్ యాదవ్ మాట్లాడుతూ క్రీడలు యువతలో క్రమశిక్షణ, జట్టుగా పనిచేసే తత్వం, ఉత్సాహాన్ని పెంపొందిస్తాయని అన్నారు. స్థానిక అసోసియేషన్ జట్టు PCL-6 టోర్నమెంట్‌లో విజయవంతంగా రాణించాలని ఆకాంక్షిస్తూ రూ.10వేల విలువైన చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here