నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ అభివృద్ధికి, ప్రజలకు అవసరమయ్యే మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేయాలని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి జోనల్ కమిషనర్ ప్రియాంక అల ను విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ప్రియాంక అలను గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. డివిజన్ పరిధిలోని రాయదుర్గం, నల్లగండ్ల హుడా, డిఫెన్స్ కాలనీ, మంజీరా డైమండ్ టవర్స్ లో నెలకొన్న డ్రైనేజీ సమస్య, నీటి సమస్యలను, రోడ్ల నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఈఈ శ్రీనివాస్ తో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి సమావేశమై సమస్యలపై చర్చించారు. పెండింగులో ఉన్న పనులను వెంటనే ప్రారంభించి త్వరిత గతిన పూర్తయ్యేలా చూడాలని కార్పొరేటర్ కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈ కృష్ణ వేణి, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, సీనియర్ నాయకులు, దుర్గ రామ్ తదితరులు పాల్గొన్నారు.