నమస్తే శేరిలింగంపల్లి: కాలనీలో నెలకొన్న ప్రతీ సమస్యను ఎప్పటికప్పుడు పరిష్కరింపజేసే దిశగా కృషి చేస్తున్నట్లు నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు భేరి రాంచందర్ యాదవ్ అన్నారు. గచ్చిబౌలి డివిజన్ నేతాజీ నగర్ కాలనీలో డ్రైనేజీ మాన్ హోల్స్ ను కాలనీ అధ్యక్షుడు రాంచందర్ యాదవ్ జీహెచ్ఎంసీ సిబ్బందితో దగ్గరుండి శుభ్రం చేయించారు. ఆయన మాట్లాడుతూ డ్రైనేజీ నిండిపోవడంతో మ్యాన్ హోల్స్ పై, నాలాలపై ఉన్న పైకప్పులు పగిలి పోవడం, మట్టిలో కూరుకుపోవడంతో డ్రైనేజీ తీయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉందన్నారు. దీంతో దుర్గందమైన వాసన రావడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని అన్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పై కప్పులు మరమ్మత్తులు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు కె.నరసింహ యాదవ్, కె.రాము, గంగమ్మ, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.