- కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో భారీ నిరసన
నమస్తే శేరిలింగంపల్లి: మహిళలను కించపరిచేలా బస్సులలో బ్రేక్ డాన్సులు చేయండి అంటూ అత్యంత హేళనగా మాట్లాడిన మాజీ మంత్రి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పట్ల అనుచితంగా మాట్లాడిన సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టగా… ఆ కార్యక్రమాల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ పాల్గొని నిరసన తెలిపారు.
తెలంగాణ మహిళల పట్ల ఇంత అవమానకరంగా మాట్లాడి వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిన కేటీఆర్ వైఖరిని నిరసిస్తూ మియాపూర్ మైత్రి నగర్ కమ్మన్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు కల్పించిన ఉచిత బస్ ప్రయానంతో ప్రజలలో వచ్చిన ఆదరణను చూసి ఓర్వలేక తెలంగాణ మహిళ సమాజ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారని, కేటీఆర్ ఒక ప్రధానమైన ప్రతిపక్ష పార్టీలో ఉండి, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పథకాలు, కార్యక్రమాలకు తనవంతుగా సలహాలు సూచనలు చేస్తూ, తెలంగాణ ప్రాంత ప్రజలకు లాభం చేకూర్చే విధంగా ఉండాలి కానీ.. తెలంగాణ సమాజం సిగ్గుపడేలా మాట్లాడంటం అనేది కేటీఆర్ అనాలోచిత విధానానికి, అహంకారానికి నిదర్శనం అని అన్నారు.
ఇక ముందు ఇలాంటి ధోరణిలో మాట్లాడకుండా ఉండాలని, కేటీఆర్ తెలంగాణ ప్రాంత మొత్తం ఆడపడుచులతో పాటు తన ఇంటి ఆడపడుచులను కూడా అవమానపరిచిన విధంగా మాట్లడడం చాలా బాధకరమని పేర్కొన్నారు. మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, నాయకులు, మహిళలు,యువకులు, యూత్ కాంగ్రెస్/ఎన్.ఎస్.యు.ఐ నాయకులు పాల్గొన్నారు.