నమస్తే శేరిలింగంపల్లి: ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది.
శుక్రవారం మధ్యాహ్నం మ్యాక్స్ మాల్, జీఎస్ ఎం మాల్ దగ్గరలో సుమారు 40-45 వయస్సున్న వ్యక్తి పడిపోయి ఉండగా.. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలికి వెళ్లి పరిశీలించారు. ఆ వ్యక్తి మరణించి ఉండటంతో గాంధీ దవాఖానకు తరలించారు. వివరాలకు 9381867314 నంబర్ లలో సంప్రదించాలని తెలిపారు.