నేరస్తులకు ఉరిశిక్ష వేయాలని… కొవ్వొత్తుల నిరసన

నమస్తే శేరిలింగంపల్లి: మణిపూర్లో శాంతియుత వాతావరణం నెలకొనాలని, మహిళలను వివస్త్రలు చేసి ఊరేగించిన నేరస్తులకు ఉరిశిక్ష వేయాలని కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నడిగడ్డ తండా బస్తీ అధ్యక్షుడు తిరుపతి నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మైదాన ప్రాంత గిరిజన సంఘం రాష్ట్ర కన్వీనర్ తుకారాం నాయక్ హాజరై మాట్లాడారు.

మణిపూర్ రాష్ట్రంలో గత రెండు నెలలుగా రెండు తెగల మధ్య అరాచకాలు సాగుతున్న హింస ఖాండా జరుగుతున్న అక్కడ పాలించే పాలకులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. మణిపూర్ లో అనేక మంది మహిళలను అత్యాచారం చేసి ఊరేగింపులు చేస్తూ హత్యలు, అత్యాచారం చేస్తున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చూస్తూ ఉండిపోయాయే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఈ దేశానికి సిగ్గుమాలిన చర్య అన్నారు. దేశం సిగ్గుపడే విధంగా మణిపూర్లో హింసలు జరుగుతున్నాయని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళను నగ్నంగా ఊరేగించిన వారిని అత్యాచారం చేసిన వారిని ఉరితీయాలని అన్నారు. మణిపూర్ రాష్ట్రంలో అల్లర్లు కట్టడి చేసి శాంతియుత పరిస్థితులు నెలకొల్పే విధంగా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్తే తప్ప బయటకు స్పందించని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు… ట్విట్టర్ లో వాట్సాప్ లలో ఫేస్ బుక్ లో వస్తే తప్ప బయటకు పెట్టని వీడియోలను ఆ రాష్ట్రంలో ఇంకా ఏవిధంగా పరిస్థితులు ఉన్నాయో తెలవడం లేదన్నారు. కార్యక్రమంలో సీతారాం నాయక్, మురళి నాయక్, బాలాజీ, జిత్తు నాయక్, లక్ష్మి, దసలీబాయి, రీనా బాయ్, ఏ లక్ష్మణ్ నాయక్, గోపి నాయక్, మోహన్ నాయక్, డి. నరసింహ, సురేష్ నాయక్, శంకర్, కృష్ణ, తిరుపతి, పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here