నమస్తే శేరిలింగంపల్లి: కొన్ని రోజులుగా కురుస్తున్న భారివర్షాలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ఆ నీటిలోనే బిక్కు బిక్కుమంటూ ఉండాల్సిన దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కాంటెస్ట్ డ్ కార్పొరేటర్ యం. డి. ఇలియాస్ షరీఫ్ ఆదేశాల మేరకు మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నల్లగండ్ల రమేష్ కుమార్ ఆధ్వర్యంలో మియాపూర్ డివిజన్ పలు కాలనీలలో ఆ పార్టీ శ్రేణులు పర్యటించారు.

అండర్ డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటాన్ని, పొంగిపోర్లుతున్న మ్యానహోల్స్ గమనించారు. బి ఆర్ ఎస్ ప్రభుత్వ పనితీరు ఎలా ఇవి చూస్తే తెలుస్తున్నదని, బి ఆర్ ఎస్ ప్రజాప్రతినిధులకు వాళ్ళ సొంత లాభాలు చూసుకోవడం తప్ప ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అసిఫ్ పటేల్, త్వోసిఫ్, అఫ్రోజ్, గురువయ్య, ఈశ్వర్, భారతమ్మ శాంత పాల్గొన్నారు.





