నమస్తే శేరిలింగంపల్లి: ప్రతి చిన్నారి ఉన్నత స్థానాలకు చేరుకొనేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తీర్చి దిద్దాలని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న, ప్రొఫెసర్ జయ శంకర్ బడి బాట కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కొండాపూర్ డివిజన్ కొత్తగూడలోని ఏంపిపిఎస్ ప్రభుత్వ పాఠశాల వద్ద నిర్వహించిన బడి బాట కార్యక్రమంలో పాల్గొని, పలువురు చిన్నారులకు పలక, బలపాలు, పెన్సిల్లు, పుస్తకాలు పంపిణి చేశారు. మంచిగా చదివి, ఉన్నత స్థానాలకు చేరుకోవాలని చిన్నారులను ఆశీర్వదించారు. ఈ సందర్బంగా పలువురు చిన్నారులకు అక్షరాభాష్యం చేయించి చిన్నారులచే అక్షరాలు దిద్దించారు.

ఈ కార్యక్రమంలో ఏంఈఓ కే. వెంకటయ్య, ఏంయన్ఓ కే. రాములు, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఏం ఏం. నాగయ్య, మౌరి టెక్ ఫౌండేషన్ నిర్వాహకులు స్వర్ణ రెడ్డి, సీనియర్ నాయకులు ఆర్ జంగం గౌడ్, నీలం లక్ష్మి నారాయణ ముదిరాజ్, కేశం కుమార్ ముదిరాజ్, నీలం లక్ష్మణ్ ముదిరాజ్, మొహ్మద్ ఖాసీం, మొగుల స్వామి సాగర్ పాల్గొన్నారు.