అరుదైన ప్యాంక్రియాటిక్ ట్యూమర్ శస్త్రచికిత్స విజయవంతం

  • కణతి( 10×6 సెం.మీ) తొలగింపు
  • నాలుగు గంటలు శ్రమించిన సర్జికల్ గాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శ్రీమన్ నారాయణ యర్రారపు, ఆయన వైద్య బృందం

నమస్తే శేరిలింగంపల్లి: అరుదైన ప్యాంక్రియాటిక్ ట్యూమర్ (కణితి 10×6 సెం.మీ) శస్త్రచికిత్స విజయవంతమైంది. పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్న 40 ఏండ్ల మహిళ కు మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు శస్త్ర చికిత్స చేసి ఉపశమనం కల్పించారు. వివరాలు… 40 సంవత్సరాల మహిళ పొట్టి కడుపు నొప్పితో బాధపడుతుంది.

కణతి తొలగింపు అనంతరం కోలుకున్న మహిళతో మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు

నొప్పి అధికమవడంతో మెడికవర్ హాస్పిటల్స్ సర్జికల్ గాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శ్రీమన్ నారాయణ యర్రారపు ని సంప్రదించింది. వైద్యుడు ఆమెను పరిక్షించి సిటి స్కాన్ తీయించగా.. ప్యాంక్రియాటిక్ ప్రాంతంలో సాలిడ్ సూడోపపిల్లరీ ఎపిథీలియల్ నియోప్లాజమ్ (స్పెన్) అనే అరుదైన ప్యాంక్రియాటిక్ ట్యూమర్‌(కణితి ) ఉన్నట్లు నిర్దారించారు. డాక్టర్ శ్రీమన్ నారాయణ యర్రారపు వైద్య నిపుణుల బృందం సుమారు 4 గంటలు శ్రమించి విప్పల్స్ ప్రక్రియ (ప్యాంక్రియాటికోడ్యుడెనెక్టమీ) ద్వారా కణితిని విజయవంతంగా తొలగించారు.

అనంతరం డాక్టర్ మాట్లాడుతూ సాధారణంగా పదిమందిలో ఒక్కరికి కనిపించే ఈ కణుతులు, సగటు 30-40 సంవత్సరాల యువతులలో ప్రధానంగా సంభవిస్తుందనీ తెలిపారు. సాధారణంగా అవి 3 నుంచి 4 సెం.మీ పరిమాణంలో మాత్రమే ఉంటాయనీ, ఈమెకు ప్యాంక్రియాస్, పోర్టల్ సిర తలపై దట్టంగా 10×6 సెం.మీ కణితి గుర్తించామని చెప్పారు. స్పెన్ కణితులు తరచుగా ప్యాంక్రియాస్ శరీరం, తోకలో ఉత్పన్నమవుతాయనీ, ఈమెకు ప్యాంక్రియాస్ తలపై ఉందన్నారు. ప్యాంక్రియాస్‌లోని సూక్ష్మక్రిమి కణాల నుండి ఇవి ఉద్భవించాయని భావించారు. శస్త్రచికిత్స అనంతరం రోగి 3 రోజుల్లోనే కోలుకున్నదనీ, 5 రోజుల్లో డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు. అత్యాధునిక సదుపాయాలు, పరికరాలు, అనుభజ్ఞులైన వైద్య నిపుణులు వల్లె ఇలాంటివి సాధ్యమవుతున్నాయనీ బేగంపేట సెంటర్ హెడ్ డాక్టర్ రాజ్ కుమార్ తెలిపారు. డాక్టర్ శ్రీమన్ నారాయణ యర్రారపుని, వారి బృందాన్ని అభినందించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here