4 ఏళ్ల నీటి కష్టాలకు ముగింపు.. గోపన్‌పల్లిలో వాటర్ సప్లైని ప్రారంభించిన రాగం హరిశంకర్ యాదవ్..

శేరిలింగంప‌ల్లి, జూన్ 1 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): నల్లగండ్ల డివిజన్ పరిధిలోని గోపన్‌పల్లి వీక‌ర్ సెక్షన్‌లో గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న తాగునీటి సమస్యకు అధికారులు శాశ్వత పరిష్కారం చూపారు. సమస్య పూర్తిగా పరిష్కారమైన అనంతరం సోమవారం బీఆర్ఎస్ పార్టీ నాయకుడు రాగం హరిశంకర్ యాదవ్ స్వయంగా వాటర్ వాల్వ్‌ను ప్రారంభించి నీటి సరఫరాను విడుదల చేశారు. అనంతరం శంకరి రాజు ముదిరాజ్, రాణి, రమేష్, శ్రీకాంత్‌తోపాటు బీఆర్ఎస్ నాయకులు ఇంటింటికి వెళ్లి ప్రతి ఇంటికి నీరు సక్రమంగా అందుతుందా లేదా అనే విషయాన్ని పరిశీలించారు. నాలుగేళ్లుగా నీటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొన్న స్థానిక ప్రజలు ప్రస్తుతం సమస్య పూర్తిగా పరిష్కారం కావడంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానికులు రాగం హరిశంకర్ యాదవ్‌ను శాలువాతో సన్మానించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సమస్య పరిష్కారానికి కృషి చేసిన శంకరి రాజు ముదిరాజ్, రాణి, రమేష్, శ్రీకాంత్‌తోపాటు ఇతర బీఆర్ఎస్ నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకత్వాన్ని స్థానికులు అభినందించారు. కార్యక్రమంలో లక్ష్మయ్య, లక్ష్మమ్మ, ప్రభు, ముగేష్, వెంకటేశ్వర్లు, గీత, సుధాకర్, శ్రీహరి, జగేశ్వర్, సుజాత, మాధవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here