తెలంగాణ అవతరణ వేడుకల్లో బీఆర్‌ఎస్ నేత పొట్ట నరేందర్ యాదవ్

శేరిలింగంపల్లి, జూన్ 2 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి గాంధీ విగ్రహం వద్ద కాలనీ వాసులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్‌ఎస్ నాయకుడు పొట్ట నరేందర్ యాదవ్ జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి సేవలను కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు ఎం. కృష్ణ యాదవ్, డి. శ్రీనివాస్, నిజాం, పి. రాజ్ యాదవ్, వి. సురేష్ ముదిరాజ్, ఎం. శ్రీనివాస్ యాదవ్, వి. రాజు యాదవ్, కే.ఎన్. రాములు, శంకర్, పట్లోల నరసింహ, జమ్మయ్య, రియాజ్, జి. రాజు, పండగల్ల అరుణ, జుబేదా బేగం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here