నమస్తే శేరిలింగంపల్లి : అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మరణించిన సంఘటన చందానగర్ పీఎస్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, ఫిర్యాదు దారు భోలేనాథ్ కథనం ప్రకారం.. జీలాని (70-75) (93991719268) అనే వ్యక్తి లింగంపల్లి మార్కెట్‌లో ఆరు నెలలుగా చింత చిగురు, సీజనల్ పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
ప్రభుత్వం అందించే 5 రూపాయల భోజనం తింటూ ఆయా పరిసర ప్రాంతాల్లో లేదా పార్కింగ్ స్థలం, తోట స్థలం వద్ద పడుకునేవాడు. అయితే 22న జీలాని అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో స్థానికుల సమాచారం మేరకు 108 అంబులెన్స్ అక్కడికి చేరుకు ప్రథమ చికిత్స అందించింది. అనంతరం చందానగర్ పీఎస్ కు.. అక్కడి నుంచి చికిత్స నిమిత్తం గాంధీ దవాఖానకు ఎస్కార్ట్ గా పంపించారు. అదే రోజు చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు తెలిపారు.