- ఏకగ్రీవంగా ఎన్నిక.. కాలనీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని హామీ
నమస్తే శేరిలింగంపల్లి : ఫ్రెండ్స్ కాలనీలో ఆదివారం అసోసియేషన్ సర్వసభ్య సమావేశ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా దుప్పెల్లి వెంకటేశం ముదిరాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు వెంకటేశం మాట్లాడుతూ కాలనీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని, ఏకగ్రీవంగా ఎన్నుకున్న కాలనీ సభ్యులందరికి పేరుపేరునా ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రములో ఫుడ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా కన్సల్టేటీవ్ కమిటీ సభ్యుడు డీవీ కృష్ణారావు, కాలనీ పెద్దలు కేఇపిసి కుమార్, బి కే నాయర్, కృష్ణానాయక్, సిన్ నాథ్, కిరణ్, రాజేందర్, ప్రకాష్ రెడ్డి, నాగార్జున, నర్సింహారావు, నవీన్, వేణుగోపాల్, కాశీ విశ్వనాధం, ఫసిహుద్దీన్, చంద్రకాంత్, రవీంద్రనాథ్, రవిచంద్ర, డాక్టర్ గోవర్ధన్, వెంకటస్వామి, రవీంద్ర, సునిత సత్యనారాయణ, రమేష్, పార్ధసారధి రెడ్డి, ప్రకాష్, శ్రీనివాస్, కిరణ్, బాబురావు, నారాయణ, నందు, ఉమా సుబ్రహ్మణ్యం, రంగారావు, చౌదరి పాల్గొన్నారు.