భావి తరాలకు మార్గదర్శకుడు కాళోజీ: ప్రభుత్వ విప్ గాంధీ

కాళోజీ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే గాంధీ తదితరులు

శేరిలింగంపల్లి: “పుట్టుక నాది, చావు నాది, బ్రతుకంతా తెలంగాణది” అంటూ జీవితాన్ని తెలంగాణ ప్రజా ఉద్యమాలకు అర్పించిన కాళోజీ నేటి తరాలకు మార్గదర్శకుడాని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ అన్నారు. బుధవారం తెలంగాణ ప్రజా కవి కాళోజీ నారాయణ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే కార్యాలయంలో జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజీ నారాయణ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.

అనంతరం గాంధీ మాట్లాడుతూ కాళోజి నారాయణ చాలా గొప్పప్రజా కవి మరియు తెలంగాణ వాది అని, ఇరవయ్యేళ్ళ వయసులోనే దేశం కోసం జైలు వెళ్ళడానికి కూడా వెనుకాడలేదన్నారు. ఆయన రచనలు మానవాళికి స్ఫూర్తి అని, ఆయన కృషిని గుర్తించిన టిఆర్ఎస్ ప్రభుత్వం కాళోజి జయంతిని తెలంగాణరాష్ట్ర బాషా దినోత్సవం గా ప్రకటించడం జరిగిందన్నారు. తన దేహాన్ని సైతం మరణానంతరం కాకతీయ మెడికల్ కాళశాలకు ఇవ్వడం జరిగినది అని గుర్తు చేసినారు .తెలంగాణ భాషను ,నుడికారాన్ని అతిగా ప్రేమించి తన భాషే తెలంగాణ భాష అని నిక్కచ్చిగా చెప్పిన భాషాభిమాని ,ప్రజా కవి కాళోజి అని ,అయన స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రం సాకారమైనదని ,ఆ మహనీయుడి జయంతిని తెలంగాణ బాషా దినోత్సవం గా జరుపుకోవడం గర్వకారణమన్నారు.

ఈ కార్యక్రమంలో టిపియుఎస్ రాష్ట్ర అధ్యక్షులు గంధం రాములు ,టిఆర్ఎస్ సీనియర్ నాయకులు పురుషోత్తం యాదవ్ , మేడ్చల్ జిల్లా గ్రంధాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్, కొండాపూర్ డివిజన్ నాయకులు అధ్యక్షులు కృష్ణ గౌడ్ ,ప్రధాన కార్యదర్శి ఆకుల తిరుపతి, సీనియర్ నాయకులు రాజు యాదవ్ , నటరాజ ,ఆకుల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here