శేరిలింగంపల్లి: రాష్ట్రంలో అవినీతి నిర్మూలన దిశగా తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన నూతన రెవెన్యూ చట్టంపై శేరిలింగంపల్లి నియోజకవర్గంలో హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి. బుధవారం నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల నాయకులు నూతన చట్టం ఆమోదం పొందడంతో సంబరాలు చేసుకున్నారు. దీనిలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు చేసి సంబరాలు జరుపుకున్నారు.
నూతన రెవెన్యూ చట్టం అవినీతి రహిత శకానికి నాంది: ప్రభుత్వ విప్ గాంధీ
మియాపూర్: శాసనసభలో నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టి ఆమోదింపజేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరేకపూడి గాంధీ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం దశాబ్దాల చరిత్ర కలిగిన రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తూ అవినీతిని అంతమొందించే దశలో రెవెన్యూ శాఖలో తెరాస ప్రభుత్వం కీలక మార్పులు తీసుకురావడం హర్షించదగ్గ విషయం అన్నారు. ప్రజల సౌకర్యార్థం, మెరుగైన సేవలను సులభతరంగా ప్రజలకు ఈ చట్టం ద్వారా అందుబాటులో కి తీసుకురావడం విశేషమని తెలిపారు. నూతన రెవెన్యూ చట్టం చరిత్రాత్మక విషయం అని,ప్రజాపాలనలో కొత్త ఒరవడిని సృష్టిస్తోంది అని,ప్రజలకు ముఖ్యంగా రైతులకు ఎంతగానో మేలు చేస్తుందని పేర్కొన్నారు.
కొత్త రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తున్నాం: కార్పోరేటర్ నవతరెడ్డి

చందానగర్: రెవెన్యూ విభాగంలో నెలకొన్న అవినీతిని నిర్మూలించాలనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టి, శాసనసభలో ఆమోదింపజేసిన నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తున్నామని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ నవతరెడ్డి అన్నారు. సభలో బిల్లు పాసైన సందర్భంగా కార్పొరేటర్ కార్యాలయంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం బాణసంచా పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు రెవెన్యూ శాఖ ప్రక్షాళనకై అసెంబ్లీ లో ప్రవేశపెట్టిన రెవెన్యూ సవరణ చట్టం సాహసోపేతమైన నిర్ణయమని కొనియాడారు. రెవెన్యూ శాఖలో అవినీతి, అక్రమాలకు తావులేకుండా ఈ నూతన చట్టం తేవడం ఎంతో గొప్ప నిర్ణయమన్నారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికై టిఆర్ ఎస్ ప్రభుత్వం తీసుకొస్తున్న పరిపాలనలోని మార్పులకు సంపూర్ణ మద్దతు తెలియచేస్తున్నామని చెప్పారు.ఈ కార్యక్రమంలో పర్నంది శ్రీకాంత్,సలీం,రాధిక,పోచయ్య,అనంత రెడ్డి,గౌస్,రమణ కుమారి,గౌస్,జహీర్,రైసా, వెంకటేశ్వర రావు,వరలక్ష్మీ, స్వప్న,శ్రీకాంత్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు
ప్రజల మనసు ఎరిగిన నిజమైన నాయకుడు కేసీఆర్: రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రజల కష్టసుఖాలు ఎరిగిన నిజమైన నాయకుడు కేసీఆర్ అని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. బుధవారం శాసన సభలో నూతన రెవిన్యూ చట్టం ఆమోదం పొందిన సందర్భంగా స్థానిక కార్పొరేటర్ కార్యాలయంలో కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేసి, సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తూ అవినీతిని అంతమొందించే దశలో శాసన సభలో రెవెన్యూ శాఖలో టీఅర్ఎస్ ప్రభుత్వం కీలక మార్పులు తీసుకురావడం హర్షింపదగనీయమన్నారు. రాష్ట్ర ప్రజలు ఏమి కోరుకుంటున్నారో గుర్తించి ప్రజల ఇష్టానుసారంగా చట్టాలను రూపొందించఫ్యామిలో కేసీఆర్ దిట్ట అని కొనియడారు. ఈ కార్యక్రమంలో గోపాల్, రవీందర్, సౌజన్య, ఆంజనేయులు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
అవినీతి రహిత, పారదర్శక పాలనలో మరో శకం ఆరంభం: కార్పొరేటర్లు పూజిత జగదీశ్వర్ గౌడ్, జగదీశ్వర్ గౌడ్

మాదాపూర్, హఫీజ్ పేట్: నూతన రెవెన్యూ చట్టానికి ఆమోదముద్ర పడటంతో తెలంగాణ రాష్ట్రంలో అవినీతిరహిత, పారదర్శక పాలనలో మరో శకం ఆరంభమైందని హఫీజ్ పేట్, మాదాపూర్ డివిజన్ల కార్పొరేటర్లు పూజిత జగదీశ్వర్ గౌడ్, జగదీశ్వర్ గౌడ్ లు పేర్కొన్నారు. బుధవారం రెవెన్యూ చట్టం ఏర్పాటు సందర్భంగా హఫీజ్ పెట్ వార్డ్ కార్యాలయం, మాదాపూర్ డివిజన్ ఖానమేట్ చౌరస్తాలలో ముఖ్యమంత్రి కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బూజు పట్టిన చట్టాల దుమ్ము దులుపుతూ..పారదర్శత, అవినీతి రహిత వ్యవస్థే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందన్నారు. శాసనసభలో చారిత్రాత్మక రెవెన్యూ బిల్లును ప్రవేశపెట్టి తరతరాలుగా ప్రజలు అనుభవిస్తున్న బాధలకు చరమగీతం పాడి, రైతులకు పేదలకు సరళీకృతమైనటువంటి కొత్త చట్టాన్ని అందించారన్నారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు,కృష్ణ గౌడ్,కృష్ణ ముదిరాజ్,వార్డ్ సభ్యులు రహీం,వెంకటేష్ గౌడ్,సార్వార్,శ్యామ్,మహేష్,మల్ల రెడ్డి,ప్రవీణ్ గౌడ్,సయ్యద సత్తార్ హుస్సేన్,లోకేష్,రవి కుమార్,సంతయ్య,సుధాకర్,సైబజ్,నర్సింగరావు,తైలి కృష్ణ,కృష్ణ నాయక్,ప్రవీణ్,జ్ఞనేశ్వర్, సంజు,శ్రీను నాయక్,రాజు,లింగ బాబు,కోటేశ్,ముజీబ్,మహిళలు పద్మ,షేబన,సీత,శ్రావణి,లక్ష్మీ,శిరీష తదితరులు పాల్గొన్నారు.
చందానగర్ లో కేసీఆర్ చిత్రపటానికి టిఆర్ఎస్ నాయకుల పాలాభిషేకం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కోత్త రెవెన్యూ చట్టం ప్రవేశపెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ చందానగర్ టిఆర్ఎస్ నాయకులు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ్ రేడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ అవినీతి రహిత పాలన కోసం నూతన రెవెన్యూ చట్టం దోహదం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు అశోక్ గౌడ్, రఘుపతిరెడ్డి, రవీందర్ రావు, గురుచరణ్ దూబే, అక్బర్ ఖాన్, ఉరిటి వెంకట్రావ్, ఓర్సు వెంకటేశ్వర్లు, మల్లేష్ గుప్తా, ప్రీతమ్, కృష్ణదాస్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.