
శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ ప్రజలందరికీ సకల మౌలిక వసతులను కల్పించేందుకు కృషి చేస్తున్నామని స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. బుధవారం డివిజన్ పరిధిలోని గోపీనగర్ లో చేపడుతున్న అంతర్గత రోడ్ల నిర్మాణ పనులను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ ఎక్కడ సమస్యలు తలెత్తినా తక్షణ పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. సిసి రోడ్ల నిర్మాణానికి ముందే కాలనీ వాసులు తమతమ ఇళ్ల నుంచి వచ్చే మురుగు నీటి పైపులైన్ ను యూజీడీ లైన్ కు కలుపుకోవాలని సూచించారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న అరుగులను, ర్యాంపులను తొలగింస్తే విశాలమైన రోడ్డు సదుపాయం కలుగుతుందన్నారు. దీని వల్ల కాలనీలో ట్రాఫిక్ సమస్య ఉండబోదన్నారు. ఇప్పటికే గోపీనగర్ లో యూజీడీ, మంచినీటి పైపులైన్ తదితర పనులను పూర్తి చేయించామని అక్కడక్కడ మిగిలిన పనులను కూడా త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. సీసీ రోడ్లను నిర్మించడం ద్వారా కాలనీ ప్రజల సమస్య తీరనుందన్నారు. ఈ పర్యటనలో ఏఈ సునిల్, నాయకులు నర్సింహా గౌడ్, పుట్ట వినయ్ కుమార్ గౌడ్, కలివేముల వీరేశం గౌడ్, నర్సింహా, విజయలక్ష్మీ, రవీందర్, చెన్నప్ప, నారాయణ, లక్ష్మీ పతి, పద్మ, ఆనంద్, కృష్ణ తో పాటు నెహ్రూ నగర్ కాలనీ టీఆర్ఎస్ బస్తీ కమిటీ అధ్యక్షుడు శ్రీకాంత్, యూత్ కమిటీ అధ్యక్షుడు మహేందర్ సింగ్ , వర్క్ ఇన్ స్పెక్టర్ యాదగిరి, తదితరులు ఉన్నారు.