నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ పరిధిలోని జేపీ నగర్ సాయిబాబా దేవాలయంలో దత్తాత్రేయ జయంతి ఉత్సవాలు వేడుకగా జరగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ పాల్గొని సాయిబాబా స్వామికి, ఉత్సవమూర్తులకు పంచామృత అభిషేకాలు, క్షీరాభిషేకం, మంగళ హారతులు ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు వీరేందర్ గౌడ్, సాంబశివరావు, దినేష్, రవీందర్ రెడ్డి, రఘుపతి రెడ్డి, ప్రసాద్, మహేశ్వర్ రెడ్డి, కృష్ణ రెడ్డి, నరేందర్ ముదిరాజ్, మాధవి రెడ్డి, ఉట్టి నరేందర్, గడ్డం మాణిక్యం రెడ్డి, సురేష్, మహిళలు పాల్గొన్నారు.
