నమస్తే శేరిలింగంపల్లి : మాదాపూర్ డివిజన్ పరిధిలోని జై హింద్ కాలనీలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వి.జగదీశ్వర్ గౌడ్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు అంగరంగ వైభవంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగని తెలిపారు.

ఏసు ప్రభు మార్గదర్శకం చేసినట్లుగా అందరూ సన్మార్గంలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, మహిళ నాయకులు, యూత్ సభ్యులు పాల్గొన్నారు.
