అశ్విని గ్రూప్ సంస్థల చైర్మన్ అశ్విని సుబ్బారావు రూ. లక్ష 50 వేలు విరాళం

  • చందానగర్ లోని సరస్వతి విద్యా మందిర్ లో నిరుపేద విద్యార్థుల కోసం అందజేత
  • ముఖ్యఅతిథులుగా హాజరై విద్యార్థులకు దిశా నిర్దేశం చేసిన ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద, కూకట్ పల్లి మున్సిపాలిటీ మాజీ చైర్మన్ సీహెచ్ హనుమంతరావు

నమస్తే శేరిలింగంపల్లి : చందానగర్ లోని సరస్వతి విద్యా మందిర్ లో సింగల్ పేరెంట్ కలిగిన నిరుపేద విద్యార్థులకు స్కూలు ఫీజుల వితరణ చేపట్టారు. దాదాపు 30 మందికి పైగా తండ్రి లేని విద్యార్థుల ఫీజుల కోసం అశ్విని గ్రూప్ సంస్థల చైర్మన్ అశ్విని సుబ్బారావు ఒక లక్ష 50 వేల రూపాయలను విరాళంగా ప్రకటించారు. భవిష్యత్తులో భారత జాతి గర్వించే వ్యక్తులుగా మారడానికి శ్రద్ధ, శ్రమ, ఆలోచన, విద్య, వినయం, వివేకం, వీరత్వం, ధీర గుణం ఎంత ముఖ్యమో వివరించారు.

చందానగర్ లోని సరస్వతి విద్యా మందిర్ లో నిరుపేద విద్యార్థుల

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద విచ్చేసి విద్యార్థులకు ఉపాధ్యాయులకు దిశా నిర్దేశం చేశారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన కూకట్పల్లి మున్సిపాలిటీ మాజీ చైర్మన్ సిహెచ్ హనుమంతరావు మాట్లాడుతూ విద్యార్థి దశలోనే దేశ అభ్యున్నతికై కలలుగనాలని కృషి చేయాలని ఉద్భోదించారు.

సరస్వతి విద్యా మందిర్ లో సింగల్ పేరెంట్ కలిగిన నిరుపేద విద్యార్థులకు స్కూలు ఫీజుల వితరణ కోసం రూ. 1లక్ష 50 వేలు చెక్కు రూపంలో అందిస్తున్న అశ్విని గ్రూప్ సంస్థల చైర్మన్ అశ్విని సుబ్బారావు, చిత్రంలో  తెలంగాణ ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద,  కూకట్పల్లి మున్సిపాలిటీ మాజీ చైర్మన్ సిహెచ్ హనుమంతరావు

ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు మూగల ప్రతాపరెడ్డి, కార్యదర్శి రఘునందన్ రెడ్డి, సహకార్యదర్శి రామచంద్రారెడ్డి, ట్రెజరర్ నాగభూషణ రావు, సభ్యులు గాలి రెడ్డి, ప్రధానోపాధ్యాయులు, ఆచార్యులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here