నమస్తే శేరిలింగంపల్లి: చందా నగర్ డివిజన్ పరిధిలోని విశ్వేశ్వరయ్య కాలనీలో నెలకొన్న డ్రైనేజీ సమస్యలపై జలమండలి అధికారులతో కలిసి పర్యటించారు చందా నగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి. ఆనంతరం సమస్యలను పరిశీలించి మాట్లాడారు.
ఎస్ టి పి వెళ్ళే ప్రధాన పైప్ లైన్ పగిలిపోవడం వల్ల సమస్య ఏర్పడిందని అన్నారు. త్వరిత గతిన పనులు పూర్తి చెయ్యాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు జీఎం రాజశేఖర్, డిజిఎం నాగప్రియ, బిఆర్ ఎస్ పార్టీ చందా నగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, పార్టీ నాయకులు నరేందర్ బల్ల, యశ్వంత్, సందీప్ రెడ్డి, సౌజన్య,రాజేశ్వరి, కాలనీ వాసులు పాల్గొన్నారు.