మియాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): కిడ్నీ సమస్యతో బాధ పడుతున్న ఓ యువకుడి వైద్య ఖర్చుల కోసం హోప్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం అందజేసింది. మదీనగూడకు చెందిన నరేందర్ గత కొద్ది సంవత్సరాలుగా కిడ్నిల సమస్యతో బాద పడుతున్నాడు. ప్రతి నెల నరేందర్ కు వైద్య ఖర్చుల నిమిత్తం రూ 10 వేల రుపాయలు ఖర్చువుతున్నాయని, ఉపాధి లేకపోవడంతో అప్పులు చేసి వైద్యం అందజేస్తున్నట్లు కుటుంబ సభ్యులు దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. విషయం తెలుసుకున్న హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్ ఒక నెలకు సరిపడే వైద్య ఖర్చుల నిమిత్తం రూ.10 వేలను నరేందర్ కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా కొండా విజయ్ కుమార్ మాట్లాడుతూ ఆపద లో ఉన్న సాటి మనిషికి అండగా నిలవడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. నరేందర్ కు సహాయం చేసేందుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సహాయం చేయదలచిన దాతలు 9949339196 ఫోన్ నెంబర్ లో సంప్రదించాలని నరేందర్ కుటుంబ సభ్యులు కోరారు.
