నమస్తే శేరిలింగంపల్లి: రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను కూకట్‌పల్లి కౌండిన్య సేవాసమితి (గౌడ సంఘం) ఆఫీస్ బేరర్లు సోమవారం కలిసి తమ సానుభూతి తెలిపారు. ఇటీవలే శ్రీనివాస్ గౌడ్ తండ్రి వి.నారాయణ గౌడ్ మృతి చెందిన విషయం విదితమే. ఈ క్రమంలోనే మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను వారు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రెసిడెంట్ గాంధీ సుబ్బారావు గౌడ్, కోశాధికారి మురళీకృష్ణ గౌడ్, సెక్రటరీలు పాండురంగారావు గౌడ్, సుధాకర్ గౌడ్ పాల్గొన్నారు.
