
కొండాపూర్: కొండాపూర్ డివిజన్ లో చేపట్టవలసిన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ స్థానిక కార్పొరేటర్ హమీద్ పటేల్ శేరిలింగంపల్లి జోనల్ కమీషనర్ రవికిరణ్ కు వినతిపత్రం సమర్పించారు. బుధవారం జెడ్ సి కార్యాలయంలో ఆయనను కలిసిన హమీద్ పటేల్ డివిజన్లో చేపట్టవలసిన అభివృద్ధి పనుల గురించి చర్చించారు. ఈ సందర్భంగా హమీద్ పటేల్ మాట్లాడుతూ కొండాపూర్ డివిజన్ పరిధిలోని గౌతమి ఎనక్లేవ్, సైబర్ హిల్స్, వడ్డెర బస్తీ, అంజయ్య నగర్, సిద్దిఖ్ నగర్, రాఘవేంద్ర కాలనీ తదితర ప్రాంతాల్లో సిసిరోడ్ల నిర్మాణం చేపట్టవలసి ఉందన్నారు. దీంతోపాటు పలు కాలనీలలో వీధి దీపాల ఏర్పాటు అవసరం ఉందని అభివృద్ధి కార్యక్రమాలకు వెంటనే నిధులు మంజూరు చేయాలని కొరినట్లు తెలిపారు. తన ప్రతిపాదనలపై జెడ్ సి సానుకూలంగా స్పందించారన్నారు.





