శేరిలింగంపల్లి పాఠశాలలో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తదితరులు.

శేరిలింగంపల్లి: జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా శేరిలింగంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు ఎంపికవడం సంతోషకరమని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన శేరిలింగంపల్లి జడ్పీహెచ్ఎస్ కు చెందిన ఆంగ్లోపన్యాసకులు పి. శ్రీనివాస్, డి.రవీందర్ ను గురువారం జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ హాజరై ఉత్తమ ఉపాధ్యాయులను శాలువా, మెమొంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేసి సత్కరించారు. ఈ పాఠశాల నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికవడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు రాజు యాదవ్, ఉపాధ్యక్షుడు పద్మారావు, ఎంఈఓ వెంకటయ్య, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here