హఫీజ్ పేట్(నమస్తే శేరిలింగంపల్లి): టిఆర్ఎస్ పాలనతో విసిగిపోయిన గ్రేటర్ ప్రజలు బిజెపి కి పట్టం కట్టేందుకు సిద్ధమవుతున్నారని బీజేపీ హఫీజ్ పేట్ డివిజన్ అభ్యర్థి అనూష మహేష్ యాదవ్ అన్నారు. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా డివిజన్ లోని పలు బస్తీలు, కాలనీలలో అనూష మహేష్ యాదవ్ పార్టీ నాయకులు,కార్యకర్తలతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను బీజేపీ కి ఓటు వేయాలని కోరారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ డివిజన్లో తాము నిర్వహిస్తున్న ఇంటింటి ప్రచారానికి విశేష స్పందన లభిస్తుందని, ప్రజలు బీజేపీ నాయకులకు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ప్రజలంతా తనను ఆదరించి కమలం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో విజయం సాధిస్తే అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి డివిజన్ ను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని, ఒక్కసారి తనకు అవకాశం ఇవ్వాలని ఆమె ఒకరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రవి, మనోజ్ యాదవ్, వెంకన్న, నాగులు, భాస్కర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
