గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలో చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు తనను మరోసారి కార్పొరేటర్‌గా గెలిపించాలని డివిజన్ తెరాస అభ్యర్థి కొమిరిశెట్టి సాయిబాబా అన్నారు. డివిజన్ పరిధిలోని ఖాజాగూడలో గురువారం ఆయన ఎమ్మెల్సీ కడియం శ్రీహరితో కలిసి ఇంటింటికీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 1న జరగనున్న ఎన్నికల్లో కార్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. డివిజన్‌లో ఇప్పటికే కోట్లాది రూపాయల వ్యయంతో అనేక అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందన్నారు. మళ్లీ అవకాశం ఇస్తే డివిజన్‌ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



నేతాజీనగర్‌లో ఎన్నికల ప్రచారం…
గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నేతాజీనగర్‌లో డివిజన్ తెరాస కార్పొరేటర్ అభ్యర్థి కొమిరిశెట్టి సాయిబాబా గురువారం ఇంటింటికీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సగర ఉప్పర సంఘం అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సాగర్, నాయకులు భేరి రామచందర్ యాదవ్, రామేశ్వరమ్మ, జంగయ్య యాదవ్, రాజు ముదిరాజ్, వెంకట్, రమేష్ గౌడ్, విజయ లక్ష్మి పాల్గొన్నారు.


