చందానగర్(నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తిశ్రీ నగర్ కాలనీలో కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి అక్సారిబేగం కు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటికీ తిరుగుతూ ఓటు వేయమని కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎం.డి.నిజామొద్దీన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అనంతరం అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీలు ప్రజల సంక్షేమాన్ని వదిలి అవినీతికి తెగబడ్డాయన్నారు.

దివంగత నేత వైయస్ఆర్ హయాంలో రాష్ట్రం సంక్షేమముతో పాటు సుస్థిర అభివృద్ధి చోటుచేసుకుందని తెలిపారు. టిఆర్ఎస్ పాలనలో ధనిక రాష్ట్రమైన తెలంగాణ అప్పులపాలయ్యిందని టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని దోచుకుంటుందని తెలిపారు. రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో నాయకులు జావీద్, మొహమ్మద్, రాజన్, కవి, బబ్లూ, ఖాజా, టిప్పు, ప్రవీణ్ కుమార్, నందు, విష్ణు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
