- గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
నమస్తే శేరిలింగంపల్లి : గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి తండాలో ఆయా తండావాసుల విజ్ఞప్తి మేరకు గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అక్కడ పర్యటించారు. స్థానికంగా నెలకొన్న సమస్యలు అడిగి తెలుసుకుని సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తమ కాలనీలో అసంపూర్తిగా మిగిలిపోయిన యూజీడీ పైప్ లైన్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని, మంచినీటి వసతిని మెరుగుపర్చాలని, పారిశుధ్యం పనులు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డిని కోరారు. దీంతో అక్కడే ఉన్న అధికారులకు ఆయా సమస్యల పరిష్కారానికి తీసుకోవలసిన చర్యలపై అధికారులతో ఆయన చర్చించారు. అందుకు కావలసిన ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీలో అసంపూర్తిగా మిగిలిపోయిన యూజీడీ పైప్ లైన్ పనులను, రోడ్లను త్వరితగతిన పూర్తి చేస్తామని, మంజీరా మంచినీటి వసతిని మెరుగుపరుస్తామని, దశలవారీగా అన్ని పనులు పూర్తి చేసి గోపనపల్లి తండాలో చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఈ దుర్గాప్రసాద్, డీఈ విసాలాక్షి, ఏఈ రమేష్, వర్క్ ఇన్ స్పెక్టర్ లక్ష్మణ్, సీనియర్ నాయకులు శేఖర్, మన్నే రమేష్, రాజు, నరసింహ, సురేష్ శంకర్, విష్ణు, కాలనీ వాసులు, స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.