నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ లోని గచ్చిబౌలి మెయిన్ రోడ్డు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన “బోనాలు” రెస్టారెంట్ ను శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిధులుగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. రెస్టారెంట్ నిర్వాహకులను కార్పొరేటర్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. నగరం రోజురోజుకు అభివృద్ధి చెందుతున్నదని, ఇలాంటి రెస్టారెంట్ల ఆవశ్యకత ఉందన్నారు.
ప్రజలు తమ దైనందిన జీవితంలో భాగంగా వారంలో ఒకసారైనా కుటుంబంతో కలిసి రెస్టారెంట్ కు వస్తారని, వారిని దృష్టిలో ఉంచుకొని మెరుగైన సేవలను కల్పించాలని అన్నారు.
రెస్టారెంట్ నిర్వాహకులు కోటేష్ యాదవ్, జ్యోతి బాబు, సుబ్బరాజు మాట్లాడుతూ..అన్నిరకాల వెజ్, నాన్ వెజ్ రుచికరమైన వంటకాలు సరసమైన ధరలకు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ ప్రారంభోత్సవంలో కృష్ణా రెడ్డి, నిర్వాహకుల బంధువులు పాల్గొన్నారు.